COMMONMEN FORUM (సామాన్యుల సంఘం) యొక్క ముఖ్య ఉద్దేశ్యము

🙏🇮🇳ఎన్నో వేల సంవత్సరాల నుండి ఈ భూమి మీద పుట్టిన సామాన్య ప్రజల ఆకాంక్ష మరియు ఆవేదన ఏమిటంటే ఎటువంటి వత్తిడులు, విభేదాలు లేకుండా సుఖంగా, సంతోషంగా ప్రకృతిలో మమేకమై ఆనందంగా బ్రతకడం.
👉🇮🇳యావత్తు దేశ సంపదపై, ప్రకృతి వనరులపై ప్రజలందరు ఉత్తరదాయిత్వ హక్కు కలిగి ఉన్నారు.
👉🇮🇳దేశ యావత్తు సంపద ఫలాలను అనుభవించే హక్కు కలిగి ఉండి కూడా ఏనాడూ సామాన్య ప్రజలు అనుభవించలేదు.
అలనాడు బలవంతుల క్రింద బలహీనుడిగా, రాచరిక పాలనలో రాజులకు దాసులుగా, బ్రిటిష్ సామ్రాజ్య పాలనలో బానిసలుగా మరియు ఈనాడు స్వతంత్ర భారత స్వయం పాలనలో కూడా సామాన్యులు ఒక బాధితులుగా చివరికి మిగిలిపోయారు.
అలనాడు బలవంతులకు, రాజులకు, సామంతులకు, బ్రిటిష్ కు, పెట్టుబడిదారులకు మోచేయిక్రింద నీళ్లు తాగి పనిచేసిన స్వార్ధ పరులు మాత్రం సంతోషంగా, సుఖంగా బ్రతికారు. వారి కుటుంబాలు, వారి భావి తారలు మాత్రం బాగుపడ్డాయి.
అయితే ఇప్పుడు, ఈ స్వతంత్ర భారత దేశ స్వయం పాలనలో కూడా పెట్టుబడిదారులు, ధనవంతులు, రాజకీయ నాయకులు, అవినీతి ప్రభుత్వ ఉద్యోగులు, దోపిడి దారులు మాత్రం బాగుపడ్డారు, వారి కుటుంబాలు, వారి భావి తారలు బాగుపడ్డాయి.
కాని దేశ సామాన్య ప్రజలు సుఖ సంతోషాలకు అప్పడు దూరంగే ఉన్నారు ఇప్పుడు
కూడా దూరంగే ఉన్నారు. సుఖ సంతోషలు సంపదలో
భాగస్వామ్యం, సంపదనును అనుభవించే హక్కు ఒక అందని ద్రాక్ష ఫలాలుగా
మిగిలాయి.
దేశ సామాన్య ప్రజలకు సుఖ సంతోషాలు దక్కక పోవడానికి కారణం, వ్యతిరేక మనసత్త్వం, గుణం గలిగిన నాయకులు మరియు ప్రజలు.
ఈ దేశం ప్రతి వ్యక్తికి ఎటువంటి తారతమ్యాలు లేకుండా సంపదను శక్తిని సమానంగా అనుభవించే అవకాశం మరియు హక్కు కల్పించింది. కానీ కొంతమంది దౌర్జన్య దోపిడి రాక్షసులు, బలవంతులు సామాన్య ప్రజల యొక్క అజ్ఞానాన్ని బలహీనత్వాన్ని అవకాశంగా మార్చుకొని అనాది నుండి సామాన్య ప్రజల సుఖ సంతోషాలను దోపిడీ చేస్తూనే ఉన్నారు. సుఖ భోగాలను, సంతోషాలను వారు మాత్రమే వారి కుటుంబాలు మాత్రమే దేశ సంపదకు యజమానులుగా కొనసాగుతు దౌర్జన్యంగా అనుభవిస్తున్నారు.
👉ఈ భూమి మీద వందకు తొంబై మంది ప్రజలు, పది మంది దోపిడీదారుల, స్వార్ధ పరుల క్రింద బానిసలుగా బ్రతకవలసిందేనా?
👉ఇందుకోసమేనా ఈ 90 మంది ఈ మట్టిలో పుట్టింది?
👉🇮🇳ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి ఈ భూమి మీద, భూమి లోపలి అన్నిరకాల సంపదలపై, నదులపై, పర్వతాలపై, కొండలపై, సముద్రాలపై, సాగర గర్భంలోని ముత్యాలపై, సాగర గర్భంలోని ఇతర సంపదలపై, ఈ భూమిపై గల సమస్త ప్రకృతి సంపదపై, ప్రకృతి ద్వారా సృష్టించ బడుతున్న ప్రతి సంపద శక్తిపై, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి పూర్తి స్వేచ్ఛతో ఎటువంటి వివక్షత అసమానతలు లేకుండా సుఖంగా సంతోషంగా సమానంగా అనుభవించే హక్కు ఉంది. కాని ఆ పరిస్థితి లేదు రాలేదు, రానివ్వలేదు.
👉ఈ హక్కులను సాధించడం కోసమే ఈ ఫోరం పుట్టుంది.
(COMMONMEN FORUM) సామాన్యుల సంఘం యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏమిటంటే:
👉🇮🇳1. ప్రతి మనిషి మరియు ప్రతి కుటుంబం అన్ని వసతులు, సౌకర్యాలతో దేశ ఆర్థిక మరియు సామాజిక అవకాశాలతో, సంతోషంగా, సుఖంగా ఎటువంటి వర్గ విభేదాలు, వివక్షత, దోపిడి లేకుండా సమానంగా పూర్తి స్వేచ్ఛతో జీవించాలి. దేశ సంపదను ప్రతి పౌరుడు అనుభవించే అవకాశము హక్కు కలిగి ఉండాలి. దీనినే సంపూర్ణ స్వాతంత్య్రం అంటాము. ఈ యొక్క సంపూర్ణ స్వాతంత్య్రం కోసమే మా ఫోరం యొక్క పోరాటం. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేందుకు సర్వదా కృషి చేస్తాము.
👉🌍2.సమస్త జీవులకు సకల సంపదలకు కారణం అయిన ఈ ప్రకృతిని ప్రజలు సర్వదా కర్తవ్యంగా కాపాడాలి, ప్రకృతిలో మమేకమై జీవించాలి. ఈ ప్రకృతిని సర్వదా కాపాడేందుకు కృషి చేస్తాము.
👉🇮🇳3.దేశ సంపదకు అందరు సమానంగా హక్కు దారులు. ఈ సంపద యొక్క ప్రతి ఫలాలను ప్రతి మనిషి ఒక
ప్రాథమిక హక్కుగా పొందుతు సుఖ సంతోషాలు అనుభవించాలి. దేశ సంపదలో ప్రతి మనిషిని
భాస్వామ్యం చేయడం కోసం, సంపద ఫలాలను
ప్రతి మనిషి పొందేలా సర్వదా కృషి చేస్తాము.
👉🇮🇳 🙏దేశ సంపదలో ప్రతి మనిషి భాగస్వామ్యం ఎందుకు?
👉1. దేశ సంపదకు దేశ ప్రజలందరు సమానంగా హక్కు దారులు. సంపద పై కొద్ది మంది మాత్రమే ఆధిపత్యం, సుఖ బోగలు అనుభవించ కూడదు.
👉2. ఇది రాచరికం కాదు ప్రజాస్వామ్యం దేశ సంపదకు దేశ సంపదకు ప్రజలే రాజులు, పరిపాలకులు ప్రజల సేవకులు మాత్రమే.
👉3.
ఆర్ధిక న్యాయం జరగకుండా సామాజిక న్యాయం జరగదు
4. ప్రతి కుటుంబానికి నాణ్యమైన విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆహారం, నివాసం, ఉపాధి అందాలి. ఇది ప్రజల రాజ్యంగా పరమైన హక్కులు. ఇది యాచన కాదు ఇది ప్రజాల హక్కు.
👉5.
ఉపాధి, వ్యాపార
అవకాశాలతో ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఆర్ధికంగా
అభివృద్ధి చెందాలి. ఇది ప్రజల
ఆర్ధిక స్వేచ్ఛ, ఆర్ధిక స్వేచ్ఛ ప్రతి పౌరుడి యొక్క జన్మహక్కు.
👉6.
మనసుకు నచ్చని వృత్తులను వత్తిళ్లకు బయపడో, గత్యంతరం లేకోనో బలవంతంగా ఎంచుకోకుండా, మనసుకు నచ్చిన వృత్తులను పూర్తి స్వేచ్ఛతో ప్రతి
మనిషి ఎంచుకొని అవకాశాలు కలిగి ఉండాలి.
👉🇮🇳🙏ప్రతి
మనిషి, ప్రతి కుటుంబం సంతోషంగా సుఖంగా జీవించాలంటే ప్రజలకు ఏమి కావాలి ?
👉ప్రతి మనిషి, ప్రతి కుటుంబం సంతోషంగా సుఖంగా జీవించాలంటే మనందరికీ కావలసింది స్థిరమైన ఆస్తి స్థిరమైన ఆదాయం ఇది ఉన్నపుడే చేతిలోడబ్బు ఉంటుంది.
👉 కుటుంబాల వద్ద డబ్బు లేకుంటే ప్రతి వ్యక్తి సంతోషంగా కుటుంబంతో గడపలేడు. స్నేహితులతో బంధువులతో, సమాజంలో ఇతరులతో సంతోషంగా గడపలేడు.
👉ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి ఆర్ధిక పరమైన సమస్యలు, వత్తిళ్లు, భాదలు, వేధింపులు ఉంటాయి. వ్యక్తి సుఖంగా ఉండడు.
👉 అనారోగ్య సమస్యలతో, వేధింపుల సమస్యలతో, దోపిడీ సమస్యలతో ఆత్మ హత్యల సమస్యలతో, పేదరికం సమస్యలతో, అవినీతి సమస్యలతో, పోషకాహార సమస్యలతో, నేరాల సమస్యలతో, మొదలగు అనేక రకాల సమస్యలతో ప్రతి కుటుంబం మరియు మొత్తం సమాజము నిత్యము బాధ లతోనే ఉంటుంది. ప్రతి నిత్యం ఆర్ధిక ఇబ్బందులతో మనిషి దుఖఃములో ఉంటాడు. కుటుంబం సుఖంగా ఉండదు, సమాజం సుఖంగా ఉండదు, దేశం సుఖంగా సుభిక్షంగా ఉండదు.
👉ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం సుఖంగా సంతోషంగా ప్రకృతిలో మమేకమై జీవించాలంటే ఈ దేశ సంపదపై మరియు సంపద సృష్టించు ప్రతి ఫలాలను ప్రతి వ్యక్తి ఒక ప్రాథమిక హక్కుగా పొందాలి. ఇదే ఏకైక అంతిమ పరిష్కారం.
👉 ఆర్ధిక స్వాంత్య్రం, ఆర్ధిక శక్తి, ప్రజల చేతికి దక్కిననాడు ప్రజలు తమ జీవితాలకు
కావలసిన అన్ని సౌకర్యలను ప్రజలందరూ కలిసి సమిష్టిగా నిర్మించుకుంటారు.
👉 ఆర్ధిక స్వాంత్య్రం, ఆర్ధిక శక్తితో ప్రజలు రాజకీయ పార్టీల యొక్క బానిసత్వం నుండి విముక్తి పొందుతారు.
👉తమకు కావలసిన నాయకున్ని ఎటువంటి ప్రలోభాలకు, ఇతర ఆర్ధిక సామాజిక శక్తులకు లోను కాకుండా ఎన్నుకుంటారు.
👉🇮🇳🙏దేశ ప్రజలకు దేశ సంపదలో రాజ్యాంగం ప్రకారం రావలసిన న్యాయమైన ఆర్ధిక పరమైన వాటాను ఒక ప్రాథమిక హక్కుగా కల్పించాలి. పౌరులందరికీ ఆర్ధిక స్వాతంత్య్రం హక్కుగా అందించాలి.
👉🇮🇳🙏 దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ ఆ స్వాతంత్ర్య ఫలాలు కొంతమంది స్వార్ద పరుల కుటుంబాల వద్ద చిక్కుకున్నాయి.
👉🇮🇳🙏 ఆర్ధిక స్వాతంత్ర్యం లేకుండా మనకు లభించిన ఈ స్వాతంత్ర్యం అసంపూర్ణ స్వాతంత్ర్యం.
👉🇮🇳🙏ఆర్ధిక స్వాతంత్రం ప్రతి పౌరుడి జన్మ హక్కు.
👉🇮🇳🙏ప్రభుత్వాలు ప్రజలందరికి సమానమైన విద్య, వైద్యం, ఆరోగ్యం, నివాసం, ఉపాధి, వ్యాపార అవకాశాలు ఎటువంటి వివక్షత లేకుండా ప్రైవేట్ యాజమాన్యం, ఆధిపత్యం, దోపిడీ లేకుండా అందించకుంటే దేనికోసం ఈ ప్రభుత్వాలు ఎవరి సంక్షేమం కోసం ఈ పరిపాలన.
👉🇮🇳🙏ప్రభుత్వాలు దేశ సంపదపై గల ఆధిపత్యం ఏ కొద్దీ మంది చేతిలోనే కేంద్రీకృతం కాకుండా అందరికి సమానంగా పంచకుంటే, అందించకుంటే దేనికోసం ఈ ప్రభుత్వాలు ఎవరి సంక్షేమం కోసం ఈ పరిపాలన.
👉🇮🇳🙏కుల మత ప్రాంత వర్గ విభేదాలు నశింప చేయడం మానేసి ప్రభుత్వాలే పెంచి పోషిస్తున్నాయి.
👉🇮🇳🙏అభివృద్ధి, న్యాయం విషయంలో ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా అందరికి సమాన అవకాశాలు అందేలా చేయండి.
🙏🙏🇮🇳 ఈ మార్పు కోసం, అవకాశాల కోసం, సుఖ సంతోషాల కోసం సామాన్య ప్రజలు 75 సంవత్సరాలనుండి ఎదురు చూస్తూనే ఉన్నారు.
👉🙏🇮🇳దేశ సంపద ఫలాలను పొందే హక్కు అవకాశము సమాన్య ప్రజలకు ఇంకా దక్కలేదు.
🙏ప్రజలందరు ఎటువంటి అసమానతలు లేకుండా ఆనందంగా జీవించాలి. సమ సమాజ స్థాపన జరగాలి.
ఒక దేశం బాగుపడ్డ నాశనమైన దానికి కారణం ఆ దేశ ఓటర్లే.
జై ఓటర్ జై జనతా జై భారత్ జై ధరిత్రి
🙏 సర్వే జనః
సుఖినోభవంతు 🙏
👉JAYA PRAKASH BHARAT
Political Social Reformer & Motivational Speaker.
President🇮🇳CommonMen Forum.
👉9441256545
Comments
Post a Comment