COMMONMEN FORUM (సామాన్యుల సంఘం) యొక్క ముఖ్య ఉద్దేశ్యము
🙏🇮🇳ఎన్నో వేల సంవత్సరాల నుండి ఈ భూమి మీద పుట్టిన సామాన్య ప్రజల ఆకాంక్ష మరియు ఆవేదన ఏమిటంటే ఎటువంటి వత్తిడులు , విభేదాలు లేకుండా సుఖంగా , సంతోషంగా ప్రకృతిలో మమేకమై ఆనందంగా బ్రతకడం. 👉🇮🇳యావత్తు దేశ సంపదపై , ప్రకృతి వనరులపై ప్రజలందరు ఉత్తరదాయిత్వ హక్కు కలిగి ఉన్నారు . 👉🇮🇳దేశ యావత్తు సంపద ఫలాలను అనుభవించే హక్కు కలిగి ఉండి కూడా ఏనాడూ సామాన్య ప్రజలు అనుభవించలేదు. అలనాడు బలవంతుల క్రింద బలహీనుడిగా , రాచరిక పాలనలో రాజులకు దాసులుగా , బ్రిటిష్ సామ్రాజ్య పాలనలో బానిసలుగా మరియు ఈనాడు స్వతంత్ర భారత స్వయం పాలనలో కూడా సామాన్యులు ఒక బాధితులుగా చివరికి మిగిలిపోయారు. అలనాడు బలవంతులకు , రాజులకు , సామంతులకు , బ్రిటిష్ కు , పెట్టుబడిదారులకు మోచేయిక్రింద నీళ్లు తాగి పనిచేసిన స్వార్ధ పరులు మాత్రం సంతోషంగా , సుఖంగా బ్రతికారు. వారి కుటుంబాలు , వారి భావి తారలు మాత్రం బాగుపడ్డాయి . అయితే ఇప్పుడు, ఈ స్వతంత్ర భారత దేశ స్వయం పాలనలో కూడా పెట్టుబడిదారులు , ధనవంతులు, రాజకీయ నాయకులు , అవినీతి ప్రభుత్వ ఉద్యోగులు , దోపిడి దారులు మాత్రం బాగుపడ్డారు , వారి కుటుంబాలు , వారి భావ