"Raise Your Voice for Public Toilets". Sign this COMMON MEN FORUM petition.

DEMANDS  ఇది మా యాచన కాదు ఇది మా హక్కు

1.       హైదరాబాద్ లో ప్రజల జనాభాకు తగ్గట్టుగా   అంతర్జాతీయ ప్రమాణాలతో 10000 ల పక్కా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించండి.

2.       పబ్లిక్ టాయిలెట్స్ స్త్రీలకు పురుషులకు వేరు వేరుగా(దూరంగా) ఏర్పాటు చేయండి.

3.       పబ్లిక్ టాయిలెట్స్ లో మూత్రానికి ఉచితంగా వెసులుబాటు ఉండాలి.

4.       పబ్లిక్ టాయిలెట్స్ యాజమాన్యం మరియు నిర్వహణ కేవలం ప్రభుత్వమే భరించాలి, ఎల్లపుడు ప్రజలకు శుబ్రంగా ఉంచాలి.

5.       పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించండి.

6.       పబ్లిక్ టాయిలెట్స్ సూచిక బోర్డ్స్  ఏర్పాటు చేయండి.

7.       అన్ని పెట్రోల్ బంక్లో  పబ్లిక్ టాయిలెట్స్ శుబ్రంగా ప్రజల వాడుకలో తప్పకుండ  ఉండేలా వెంటనే ఏర్పాటు చేయండి.

8.       ఇంతవరకు పబ్లిక్ టాయిలెట్స్ పేరుమీద జరిగిన అవినీతికి , నిర్లక్ష్యానికి, నష్టానికి బాద్యులపైనా కఠినమైన చర్యలు తీసుకోండి.

 

DEMANDS This is not our begging, this is our right

1.       Build 10000 public toilets of international standards to suit the population of Hyderabad.

2.       Make public toilets separate (away) from men and women.

3.       Public toilets should have free access to urine.

4.       The ownership and maintenance of public toilets should be borne by the government alone and should always be kept clean for the public.

5.       Provide employment opportunities through maintenance of public toilets.

6.       Put up public toilets signboards.

7.       Immediately arrange public toilets in all petrol stations to ensure that public toilets are kept clean.

8.       Take strict action against those responsible for the corruption, negligence and damage done so far in the name of public toilets.

 

RAISE YOUR VOICE FOR “PUBLIC TOILETS”

BETTER HYEDERABD & BETTER PEOPLE

GHMC కి సిగ్గురాదు, బుద్ది రాదు, భాద్యత లేదు అనుకుంటే మరి HYDERABDAD ప్రజలకు ఏమైంది ? మీకు లేదా బాధ్యత?  ఈ సమస్య మీ అమ్మ నాన్నలది కాదా ? ఇంట్లో ఆడవాళ్లది , అక్క చెల్లెలు, అన్న తమ్ములది కాదా? ఇది నా ఒక్కడి సమస్య కాదు,  కామన్ మెన్ ఫోరమ్,(సామాన్యుల సంఘం) ఏర్పాటు చేసిందే సామాన్య ప్రజల కోసం.  ఇకనైనా మీ గొంతు ఇప్పండి పబ్లిక్ టాయిలెట్స్ పై మా తో కలిసి చేయి కలపండి. మాకు మద్దతు తెలుపండి. ఈ వీడియో ను ప్రతి ఒక్కరికి చేరేలా ఫార్వర్డ్ చేయండి.  బెటర్ హైదరాబాద్ బెటర్ పీపుల్ గా మారండి , గ్రేటర్ హైదరాబాద్ కాదు బెటర్ హైదరాబాద్ గా భాగ్యనగరాన్ని మార్చుదాం. చచ్చిన శవంలా బ్రతకకండి, మీకు తోడుగా కామన్ మెన్ ఫోరమ్ ఉంది . ఈ రోజు నుండి సరిగ్గా వంద రోజుల్లో హైదరాబాద్ ప్రజలకు సరిపడా పబ్లిక్ టాయిలెట్స్ GHMC వెంటే అంతర్జాతీయ స్థాయిలో ఉచితంగా నిర్మించాలి. వివిధ రకాల  పన్నుల రూపంలో  కోట్ల రూపాయలు హైదరాబాద్ ప్రజలు కడుతున్నారు . మనం కట్టిన ప్రతి పైసా ప్రజల కనీస అవసరాలు తీర్చడం కోసమే  ఉపయోగించాలి .  అంతేకాని పనికి రాని పథకాలు ప్రాజెక్టులు తీసుకువచ్చి ప్రజాధనాన్ని పంది కొక్కుల్లా అధికారులు మేయడానికి కాదు. ప్రజల కనీస అవసరాలు తీర్చని ప్రభుత్వ మొండి వైఖరి నిర్లక్ష్య వైఖరి , అవినీతి వైఖరి పై మాతో కలిసి మీ గొంతు విప్పండి .

"రైజ్ యువర్ వాయిస్ ఫర్ పబ్లిక్ టాయిలెట్స్".

COMMON MEN FORUM పిటిషన్ పై సంతకం చేయండి. 

సంతకం చేయడం కోసం లింక్ ఓపెన్ చేసి  మీ పేరు ఎస్ ఐ సపోర్ట్ అని టైపు చేయండి

 

If you think that GHMC has no shame, no sense, no responsibility, then what happened to the people of HYDERABAD? Are you no responsible? This problem is not your mother and father is facing? Isn't it the women in the house, the elder sister, the younger brother is facing this issue? This is not my problem alone; Common Men Forum has been established for the common people. Raise your voice and join hands with us on public toilets. Support us. Forward this video to everyone. Better Hyderabad Become from the Better People, Let's change Bhagyanagar to Better Hyderabad, not Greater Hyderabad. Don't live like a dead corpse, Common Men Forum is there to fight for the rights of the people. In exactly 100 days from today, adequate public toilets for the people of Hyderabad should be built by GHMC at international level free of charge. The people of Hyderabad are paying crores of rupees in the form of various types of taxes. Every penny we earn should be used to fulfil the basic needs of the people. Moreover, it is not for officials to graze public funds like pig's beaks by bringing projects that are not working. Raise your voice with us on the government's stubborn attitude, careless attitude and corrupt attitude of not meeting the basic needs of the people.

Sign this COMMON MEN FORUM petition.

Open the link to sign up and type your name ,and YES  I Support


Comments

Popular posts from this blog

Common Men Forum - Voter's Manifesto కామన్ మెన్ ఫోరమ్ - ఓటర్స్ మ్యానిఫెస్టో